తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల హడావుడి మొదలైంది.అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది.
ఈ మేరకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా ఈనెల 25 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది.అదేవిధంగా టీపీసీసీ దరఖాస్తు రుసుము ఖరారు చేసిందని తెలుస్తోంది.ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.25,000 వేలుగా టీపీసీసీ నిర్ణయించింది.అటు బీసీ, ఓసీ అభ్యర్థులకు రూ.50 వేల దరఖాస్తు రుసుము ఉండనుంది.