ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఎస్కే మిశ్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈడీ డైరెక్టర్ గా ఎస్కే మిశ్రాను సెప్టెంబర్ 15 వరకు కొనసాగించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
అయితే ఈనెల 31వ తేదీలోగా ఈడీ డైరెక్టర్ పదవీ విరమణ చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేంద్రం విన్నపం మేరకు ఎస్కే మిశ్రా పదవీకాలంను సుప్రీం న్యాయస్థానం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.