ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు చేసిన డేగలు.. వీడియో వైరల్..

అడవులు, సరస్సుల పైన బాల్డ్ ఈగల్స్‌( Eagles ) హాయిగా విహరిస్తూ ఉంటాయి.ఈ భారీ పక్షులు, తెల్లటి రంగు తలలతో చాలా అందంగా కనిపిస్తాయి.

 Eagles Performed Amazing Stunts In The Sky Video Viral, Viral News, Viral Video-TeluguStop.com

అవి తమ జీవితాంతం హాయిగా గడిపేందుకు ఒక అందమైన పార్ట్‌నర్‌ను కూడా ఎన్నుకుంటాయి! హాయిగా ఉండే గూడును నిర్మించుకోవడానికి స్థిరపడే ముందు, అవి ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలను కలిసి ప్రదర్శిస్తాయి.చూసేందుకు వాటి విన్యాసాలు ఎలా ఉంటాయో చూపించే వీడియోను తాజాగా @ScienceGuys_ అనే ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసింది.

దీనికి ఇప్పటిదాకా 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే రెండు డేగ లవర్స్ ఆకాశంలో విహరిస్తూ తమ పంజాలను ఒక దానికి ఒకటి లాక్ చేసుకోవడం చూడవచ్చు.తర్వాత అవి ఒక చక్రంలాగా గుండ్రంగా ఆకాశంలోనే తిరుగుతూ ఆశ్చర్యపరిచాయి.మేఘాలలో నృత్యం చేసినట్లు ఈ దృశ్యం కనిపించింది.

అవి ఒకదానికొకటి వెంబడించుకుంటాయి.గాలిలో పతంగుల లాగా విహరించాయి.

అకస్మాత్తుగా, అవి కిందకి దూసుకెళ్లి గాలిలో తాళాలు లాగా లాక్ చేసుకున్నాయి.ఈ బలం , జట్టుకృషితో అవి కార్ట్‌వీల్ లాగా మారాయి.

అవి నేలను తాకడానికి ముందు, అవి విడిపోయాయి.తిరిగి పైకి ఎగిరాయి.

వైమానిక విన్యాసాలు( Aeronautics ) వినోదం కంటే ఎక్కువ.అవి ఫిట్‌నెస్, నమ్మకానికి ఒక పరీక్ష, పిల్ల ఈగల్స్‌ను కలిసి పెంచడానికి బలమైన, తెలివిగల పార్ట్‌నర్‌ను ఎంపిక చేసుకోవడానికి ముందు ఈ విన్యాసాలను ఆడ పక్షి చేస్తుంది.ఆడది ఇష్టపడితే, మగ పక్షికి రుచికరమైన చేప ఆఫర్ చేస్తుంది.ఆపై అవి కలిసి ఒక ఎత్తైన గూడును నిర్మిస్తాయి.తీవ్రమైన శ్రద్ధతో పిల్లలను పెంచుతాయి.వైర్లు అవుతున్న వీడియో చూసి చాలామంది నెటిజన్లు అబ్బుర పడుతున్నారు.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube