గత రెండు రోజులలో మూడు కేసులో 7 వేల మత్తు ఇంజక్షన్ లు స్వాధీనం చేసుకున్నాం.వెస్ట్ బెంగాల్ ( West Bengal )నుంచి ఈ మత్తు ఇంజెక్షన్ లు సరఫరా చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది.
ఈ ఇంజెక్షన్లు సర్జరీకి ముందు వాడతారు.
ఇవి సింతటిక్ డ్రగ్స్( Drugs ).ఇవి చిన్న మోతాదులో వాడుతుంటే,అలవాటుగా మారిపోతుంది.తక్కువ రేట్లుకి వస్తున్నాయని మత్తు కోసం ఇవి కొంత మంది యువకులు వాడుతున్నారు.ఈ ఇంజెక్షన్లు రేటు రూ.26 ఉంది.అల్లిపురం( Allipuram )లో 42 బాక్స్ లో ఉన్న 2,100 pentazocine ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాము.మొత్తం మూడు కేసులలో 8 మంది అరెస్ట్.A1 కల్లా హరి పద్మ రాఘవ రావు, A2 రవి, A3 చిరంజీవి.