యజమానిని మార్చరీలోకి తీసుకెళ్లడం చూసిన కుక్క.. 4-నెలలుగా హాస్పిటల్ ముందే పడిగాపులు..

కుక్కలు తమ యజమాని పట్ల అచంచలమైన విధేయత, ప్రేమ కనబరుస్తాయి.వారిని కాపాడేందుకు మరణించడానికి కూడా ఇది సిద్ధమవుతాయి.

 Dog Waits In Front Of Kerala Mortuary For Its Deceased Master Details, Kerala, M-TeluguStop.com

వాటి ప్రేమ, విశ్వాసం కూడా సాటిలేనిది.కేరళలో( Kerala ) ఒక కుక్క ఈ నిజాన్ని మరోసారి నిరూపిస్తోంది.

చనిపోయిన యజమానిని మళ్లీ చూడాలనే ఆశతో ఇది ఆసుపత్రి మార్చురీలో( Mortuary ) నాలుగు నెలలు వెయిట్ చేస్తూ ఉంది.ఈ హార్డ్ బ్రేకింగ్ స్టోరీ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చాలా మందిని కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే, కేరళలోని కన్నూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తన యజమానితో పాటు వెళ్లిన కుక్క కూడా వెళ్ళింది యజమాని అనారోగ్యంతో బాధపడుతున్నాడు.ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ అతడు మరణించాడు.

మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.ఇది గమనించిన కుక్క( Dog ) మృతదేహాన్ని మార్చురీ గేటు వరకు అనుసరించింది.

అప్పటి నుండి, కుక్క అక్కడి నుండి వెళ్ళడానికి నిరాకరించింది.పగలు, రాత్రి అక్కడే ఉండి, గేటు పక్కనే తింటూ పడుకుంది.

కుక్క తన యజమాని( Dog Owner ) ఇంకా బతికే ఉన్నాడని, ఏదో ఒక రోజు తన వద్దకు తిరిగి వస్తాడని బలంగా నమ్మింది.పాపం ఆ మూగ జంతువుకి తన యజమానిక రాడని తెలియదు.ఆ విషయం దానికి ఎలా చెప్పాలో తెలియకపోవడం మరింత విషాదకరం.ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు కుక్కకు బిస్కెట్లు తినిపించి( Biscuits ) ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ కుక్క యజమాని కనిపించేంత వరకు అతడి కోసం నిరీక్షిస్తోంది.

కుక్కకు కొత్త ఇంటిని కనుగొనడానికి సిబ్బంది కూడా ప్రయత్నించారు, కానీ కుక్క ఎవరితోనూ వెళ్ళలేదు.కుక్క దుస్థితి చాలా మంది హృదయాలను తాకింది, వారు దాని చిత్రాలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పంచుకున్నారు.కుక్క కథను యజమాని చనిపోయిన తర్వాత తొమ్మిదేళ్ల పాటు రైలు స్టేషన్‌లో యజమాని కోసం వేచి ఉన్న పాపులర్ జపనీస్ కుక్క హచికోతో( Hachiko ) పోల్చారు.మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న బంధానికి, కుక్కలకు వాటి యజమానులపై ఉండే ఎనలేని ప్రేమకు ఈ కుక్క కథే నిదర్శనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube