భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాలు ఏమిటో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా వున్న ఖరీదైన నగరాలు( Expensive Cities ) గురించి మనకి తెలియక పోయినా కనీసం మనదేశంలో ప్రముఖ నగరాల గురించి ఓ అవగాహన ఉండడం చాలా అవసరం.ఎందుకంటే మనం ఆయా నగరాలకు ఎప్పుడైనా వెళ్ళల్సి రావచ్చు.

 Do You Know Which Are The Most Expensive Cities In India Details, Latest News, V-TeluguStop.com

ఇక విదేశాల సంగతి చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే అక్కడికి చాలా తక్కువమంది వెళుతూ వుంటారు.

ఇండియాలో( India ) అత్యంత ఖరీదైన నగరాలు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? మెర్సర్ సర్వే 2023( Mercer Survey 2023 ) నివేదికలో భారతదేశంలో నివసించే అత్యంత ఖరీదైన నగరం జాబితా గురించి వెల్లడించింది.

ఈ లిస్టులో ముందు వరుసలో “ముంబై” ( Mumbai ) ఉంది.

ముంబైని కలల నగరం అని కూడా పిలుస్తారు.ఎందుకంటే ఇక్కడికి అనేకమంది ప్రజలు తమ కలలను సాకారం చేసుకోవడానికి వస్తారు.

సూపర్‌స్టార్ల నుండి పెద్ద వ్యాపారవేత్తలు, మత్స్యకారుల తెగలు, మురికివాడల వరకు ముంబై అన్ని రకాల ప్రజలకు నిలయం.కానీ ఇక్కడ ప్రజలు నివసించడం చాలా కష్టతరం.

ఇక్కడ ఒక గది ఖర్చు కూడా అక్కడి ప్రజల బడ్జెట్‌ పరిధిని దాటి వెళుతుంది.తరువాత లిస్టులో భారతదేశ రాజధాని “ఢిల్లీ”( Delhi ) అత్యంత ఖరీదైన నగరంగా పిలవబడుతోంది.

ఢిల్లీని కాస్మోపాలిటన్ నగరం అని పిలుస్తారు.

Telugu Bengaluru, Chennai, Delhi, Latest, Mercer, Expensive, Mumbai, Pune-Latest

ఢిల్లీలో నివసించడం కూడా కష్టమే.ఎందుకంటే, ఇక్కడ జీవించడం చాలా ఖరీదుతో కూడుకొన్నది.తరువాత లిస్టులో “బెంగళూరు”( Bengaluru ) నగరం వుంది.

గార్డెన్ సిటీ నుండి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా వరకు, బెంగళూరు క్రమంగా భారతదేశంలో 3వ అతిపెద్ద నగరంగా వెలుగొందుతోంది.దీనిని గ్రీన్ ల్యాండ్ అనికూడా అంటారు.

అయితే ఇక్కడ నివసించడం కూడా కష్టమే అని అంటున్నాయి సర్వేలు.ఇక ఆ తరువాత “చెన్నై”( Chennai ) సిటీ గురించి మాట్లాడుకోవాలి.

Telugu Bengaluru, Chennai, Delhi, Latest, Mercer, Expensive, Mumbai, Pune-Latest

ఈ నగరం సాంస్కృతిక చరిత్రను కలిగి ఉంది.చెన్నై నగరం సందర్శించేందుకు కూడా ఖరీదైనదే అని అంటూ వుంటారు.ఇక నివసించే విషయం గురించి ఇక్కడ మాట్లాడుకోవలసిన పనిలేదు.ఇక చివరగా “పూణే”( Pune ) సిటీ గురించి మాట్లాడుకోవాలి.మహారాష్ట్రలోని పూణె జీవనశైలి పరంగా భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది.అందుకే దీనిని “ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్” అని పిలుస్తూ వుంటారు.

జీవనం పరంగా పూణే కూడా చాలా ఖరీదైనదనే చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube