ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 కి( Bigg Boss 7 ) ఇంతమంచి రెస్పాన్స్ వస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.ఈ సీజన్ లో హాట్ బ్యూటీ గా మంచి పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు రతికా.
( Rathika ) మొదటి వారం లోనే తానూ ఎంత సత్తా ఉన్న కంటెస్టెంట్ అనేది నిరూపించుకున్న రతికా, చిన్నగా తన గ్రాఫ్ ని తగ్గించుకుంటూ వచ్చింది.బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు కొనసాగే కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుంది అనుకుంటే నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యి అందరినీ షాక్ కి గురి చేసింది.
హౌస్ లో కన్నింగ్ గేమ్స్ ఆడడం వల్లే ఆమెని జనాలు ఇంటికి పంపేశారు అని అంటున్నారు విశ్లేషకులు.ఇప్పుడు ఈ వారం ఆమె మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ( Wild Card Entry ) ద్వారా లోపలకు వెళ్లబోతుంది.
ఈ రీ ఎంట్రీ లో ఆమె ఎలా ఆడబోతుందో, ఏమి స్ట్రాటజీ ఉపయోగించబోతుందో అనేది చూడాలి.ఇదంతా పక్కన పెడితే రతికా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు రతికా చాలా సినిమాల్లో హీరోయిన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసింది.పటాస్( Pataas ) అనే స్టాండప్ కామెడీ షో ద్వారా కెరీర్ ని ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ, ఆ తర్వాత పలు చిన్న బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, ‘కార్తికేయ 2 ‘( Karthikeya 2 ) వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం లో నెగటివ్ రోల్ లో కూడా తళుక్కుమని మెరిసింది.
ఈ చిత్రం లో ఆమె విలన్స్ గ్యాంగ్ కి సంబంధించిన మనిషిగా కనిపిస్తుంది.పాత్ర చిన్నది కాబట్టి ఈమెని పెద్దగా ఈ సినిమాలో ఎవరూ గుర్తించలేదు.కానీ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రం( Amigos ) ద్వారా మాత్రం ఈమెకి మంచి గుర్తింపు ని తెచ్చిపెట్టింది.
ఇక నేడు విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’( Bhagavanth Kesari ) చిత్రం లో కూడా నటించింది.ఇందులో ఆమె ఎమ్యెల్యే పాత్ర పోషించింది అట.ఇలా ఆమె మనకి తెలియకుండా ఎన్నో సినిమాల్లో నటించింది.ఇప్పుడు తెచ్చుకున్న ఫేమ్ తో ఆమె రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని మంచి అవకాశాలను సంపాదిస్తుందో చూడాలి.అత్యంత పేదరికం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రతికా, ఎన్నో కష్టాలను అవమానాలను ఎదురుకొని నేడు ఈ స్థాయికి చేరుకుంది.
ఇన్ని రోజులు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రతికా, ఇక నుండి పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్ కొడుతుందో లేదో చూడాలి.