వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్( Vemulawada Rural Police Station ) ను గురువారం జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్లో గల పెండింగ్ కేసుల వివరాలు( Pending Cases ) తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకొని నేరాల నియాత్రణకు కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ.

పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు ,సిబ్బంది విధులు నిర్వహించాలని, బ్లూకోట్స్‌ ,పెట్రో కార్ సిబ్బంది 24 గంటలపాటు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించారు.పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని,విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకరవలన్నారు.రాబోయే లోక్ సభ ఎన్నికల( Loksabha Elections ) సందర్బంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా, ఎన్నికల సమయంలో సమస్యలును సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఉంచాలన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరస్తుల, రౌడీ షీటర్ల వివరాలు,స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు.గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని,వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలన్నారు.

Advertisement

గ్రామ పోలీస్ అధికారులు( Village Police Officials ), సిబ్బంది తరచు గ్రామాలు,సమస్యాత్మక గ్రామాలను పర్యటిస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలు, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న వారిపై దృష్టిసారించాలన్నారు.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో జిల్లా , కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్,రూట్ మార్చ్ లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు.

ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రాచారి, సి.ఐ శ్రీనివాస్,ఎస్.ఐ మారుతి, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News