వామ్మో, సబ్బు వాడటం ఇంత ప్రమాదకరమా?

ఈ సబ్బు మీ జిడ్డుని తొలగిస్తుంది.కావాలంటే వాడి చూడండి .

 Disadvantages Of Using A Soap-TeluguStop.com

ఛాలెంజ్ అంటూ వచ్చిరాని భాషలో చెబుతుంది పని దొరికిన మోడల్.నా సౌందర్య రహస్యం ఇదే, మీరూ వాడండి అంటూ, బొటాక్స్, మేకప్ లేకుండా కంటికి కనిపించని హీరోయిన్ యాడ్ చేస్తుంది.

వారిని నమ్మి లేదా అందరు వాడుతున్నారు కదా అని మనం కూడా రకరకాల సబ్బులు వాడతాం.ఈ సబ్బులు కొత్తగా తెచ్చిపెట్టే లాభాలు పెద్దగా ఉండవు కాని, మీకు తెలియకుండా మీ చర్మాన్ని చాలా రకాలుగా నాశనం చేస్తూ ఉంటాయి.

సబ్బుల్లో కాస్టిక్ సోడా వాడతారు.ఇది ఎంత శక్తివంతమైనదంటే, ఏదైనా మెటల్ వస్తువు మీద పెయింట్ ఉన్నా మాయం చేసేస్తుంది.కార్లు, బైకుల మీద పాత పెయింట్ తీసేందుకు దీన్నే వాడతారు కూడా.మీకు నమ్మాలనిపించకపోతే, సబ్బుతో ముఖం కడుక్కోగానే, గోరుతో కాస్త గీరండి ముఖాన్ని.

తెల్లటి పదార్థం ఒకటి మీకు గోటికి చిక్కుతుంది.అది కాస్టిక్ సోడానే.

సబ్బుల్లో పీహెచ్ లెవెల్ అధికంగా ఉంటుంది.ఇది మీ చర్మంపై ఉండే ముఖ్యమైన ఆసిడ్ లేయర్ కి ప్రమాదం.

క్రిములతో పోరాడే ఆ ఆసిడ్లను మింగేస్తూ ఉంటుంది సబ్బు.దీనివలన మీ చర్మం విటమిన్ డి ని కూడా కోల్పోతూ ఉంటుంది.

మన చర్మంపై ఆయిల్ గ్రంధులు ఉంటాయి.ఇవి సహజంగా ఏర్పడేవి.

మన చర్మాన్ని ఎన్నోరకలుగా కాపాడతాయి ఇవి.ఆ గ్రంధులకు కూడా పెద్ద శతృవు సబ్బు.

పూర్వకాలంలో ఇన్నిరకల చర్మవ్యాధులు విన్నామా? వాళ్ళ సబ్బులు వాడారా? చర్మాన్ని శుభ్రపరుచుకోవడానికి నిమ్మరసం, తేనే, ముల్తాన్ మిట్టి వంటి సహజమైన సాధనాలు వాడటమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube