2017తో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో పలువురు బీజేపీ సీనియర్లు రాష్ట్రపతి పదవిపై కన్నేసినట్లు సమాచారం .విశ్వసనీయ వర్గాల కథనాల ప్రకారం సీనియర్ నేత మురళీమనోహర్ జోషి ఈ రేసులో ముందున్నట్లు వినవస్తోంది.
అటల్ బీహారీ వాజ్ పేయి, అద్వానీలతో సమాన హోదాలలో పార్టీలో పనిచేసిన మురళీమనోహర్ జోషీ భాజపా అధ్యక్షుడుగానూ తన మార్కు చూపారు.గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నా, ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లను ఢిల్లీలో కలిసిన ఆయన తన మనసులోని మాటను చెప్పారని, కొంత కాలం వేచి చూడాలని వారు చెప్పినట్లు భాజపా వర్గాల నుంచి వినవస్తున్న కథనం.
వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే అధికారికంగా పొందిన సీట్లతో భాజపా తన మిత్ర పక్షాలతో రాష్ట్రపతి పదవిని గెలుచుకోవటం పెద్ద కష్టం కాని పని, వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తదుపరి రాష్ట్రపతి ఎవరన్న విషయంలో రాజకీయవర్గాలలో ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఈ విషయంపై ఇప్పటికే పలువురు నేతలు తమ పేర్లను పరిశీలించాలని మోడీని ఆరెస్సెస్ ఛీఫ్‌ని కలవటం జరుగుతోంది.
కాగా మురళీమనోహర్ జోషికే మార్కులు ఎక్కువ లభించినట్లు వినవస్తోంది.







