ప్రేమతో చేసిన బిర్యాని అంటూ ఆ ఫోటోలను షేర్ చేసిన విగ్నేష్... ఫోటోలు వైరల్!

లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార(Nayanatara) గురించి పరిచయం అవసరం లేదు.ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ (Vignesh Shivan) నుప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

 Director Vignesh Shivan Posted That They Have Got A Lot Of Biryani For Ramzan De-TeluguStop.com

ఇక విగ్నేష్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.విగ్నేష్ తన కిచెన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉన్నాయని తెలుస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ ఘనంగా రంజాన్ (Ramzan)పండుగ జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ పండుగను సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

సాధారణంగా మనం ఏదైనా ఒక పండుగ జరుపుకుంటే పెద్ద ఎత్తున సన్నిహితులకు స్నేహితులకు కానుకలు పంపించడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు నయనతార దంపతులకు వివిధ రకాల ఆహార పదార్థాలను పంపించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆహార పదార్థాలకు సంబంధించిన ఫోటోలను విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోను షేర్ చేసిన ఈయన ప్రేమతో చేసిన బిర్యాని రంజాన్ ను ఇలా సెలబ్రేట్ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.ఈద్ ముబారక్ అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నయనతార విగ్నేష్ దంపతులు వివాహం కొంతకాలం పాటు రిలేషన్ లో ఉంటూ గత ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకోగా, పెళ్లి జరిగిన నాలుగు నెలలకే వీరిద్దరు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.ఇక నయనతార కూడా ఒకవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె షారుఖ్ ఖాన్ సరసన జవాన్ (Jawan) సినిమాలో నటిస్తున్నారు.

అలాగే కమల్ హాసన్ సినిమాలో కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube