వేస‌విలో ఇట్టే నీర‌సం వ‌చ్చేస్తుందా? అయితే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది ఉండాల్సిందే!

వేస‌వి అంటేనే మండే ఎండ‌లు, ఉక్క‌పోత.అయితే వీటి కార‌ణంగా చాలా మందిని నీర‌సం స‌మ‌స్య తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటుంది.

 This Recipe Helps To Get Rid Of Fatigue In Summer! Mango Overnight Oats, Fatigue-TeluguStop.com

అందులోనూ కొంద‌రు ఏ చిన్న ప‌ని చేసినా ఇట్టే నీర‌సించి పోతుంటారు.దాంతో ఆ నీర‌సాన్ని వ‌దిలించుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.

ఈ లిస్ట్‌లో మీరు ఒక‌రా.? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెసిపీ మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఖ‌చ్చితంగా ఉండాల్సిందే.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఈ రెసిపీ ఏంటో, దాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఎందుకు తీసుకోవాలో చూసేయండి

ముందుగా ఒక బౌల్‌లో గ్లాస్ ఆల్మండ్ మిల్క్‌, రెండు టేబుల్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకుని రాత్రంతా నాన‌బెట్టుకోవాలి.ఉద‌యాన్నే నాన‌బెట్టుకున్న ఓట్స్‌, చియా మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజ‌ల పొడి, రెండు టేబుల్ స్పూన్ల బాదం ప‌లుకులు , రెండు టేబుల్ స్పూన్ల‌ పిస్తా ప‌లుకులు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని ఒక‌సారి క‌లుపుకోవాలి.

చివ‌రిగా ఇందులో పీల్ తొల‌గించి క‌ట్ చేసి పెట్టుకున్న‌ మామిడి పండు ముక్క‌లు ఒక క‌ప్పు వేసుకుని క‌లిపితే మ్యాంగో ఓవ‌ర్ నైట్ ఓట్స్ సిద్ధం అవుతుంది.సూప‌ర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని చ‌క్క‌గా బ్రేక్‌ఫాస్ట్‌లో గ‌నుక తీసుకుంటే నీర‌సం అన్న స‌మ‌స్య మీ ద‌రి దాపుల్లోకే రాకుండా ఉంటుంది.బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారికి ఈ మ్యాంగో ఓవ‌ర్ నైట్ ఓట్స్ సూప‌ర్ గా హెల్ప్ చేస్తుంది.దీనిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే వేగంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

అతి ఆక‌లి స‌మ‌స్య ఉంటే దూరం అవుతుంది.అలాగే ప్ర‌స్తుత వేస‌వి కాలంలో పైన చెప్పిన రెసిపీను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది.

జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.మ‌ల‌బ‌ద్ధకం స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

మ‌రియు ర‌క్త‌పోటు కూడా కంట్రోల్ త‌ప్ప‌కుండా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube