రోడ్డు పక్కన కూర్చొని మూడు గంటలు ఏడ్చాను.. సుజీత్ సంచలన వ్యాఖ్యలు?

తొలి సినిమా రన్ రాజా రన్ తో దర్శకుడు సుజీత్ తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.సుజీత్ లోని టాలెంట్ ను మెచ్చిన ప్రభాస్ సాహో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు.

 Director Sujeeth Comments About His Career Starting Problems , Career Starting P-TeluguStop.com

సాహో మూవీ బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చినా టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు.ఈ డైరెక్టర్ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందుల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తాను కెరీర్ తొలినాళ్లలో ఒక లవ్ స్టోరీని రాసుకున్నానని నిర్మాతలకు కథ వినిపించగా ఫస్ట్ హాఫ్ వాళ్లకు ఎంతగానో నచ్చిందని సుజీత్ అన్నారు.ఆ తర్వాత దాదాపు 5 నెలల పాటు శ్రమించి సెకండాఫ్ పూర్తి చేశానని సుజీత్ చెప్పుకొచ్చారు.

కథ విన్న నిర్మాతలు బాగుందని చెప్పడంతో సంతోషించానని బైక్ పై తాను వెళుతున్న సమయంలో ఫోన్ రింగ్ కాగా లిఫ్ట్ చేస్తే ఈ కథకు ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉందని వేరే కథ ఉంటే చెప్పాలని నిర్మాతలు తనతో అన్నారని సుజీత్ వెల్లడించారు.

Telugu Career Problems, Sujeeth, Ram Charan, Run Raja Run, Days Cried, Tollywood

నిర్మాతలు అలా చెప్పడంతో దాదాపు మూడు గంటలు ఏడ్చానని సుజీత్ అన్నారు.ఆ తర్వాత తాను వెన్నెల కిషోర్ కు ఫోన్ చేసి ఆ విషయం చెప్పగా వెన్నెల కిషోర్ ధైర్యం చెప్పారని సుజీత్ వెల్లడించారు.అదే సమయంలో బండిలో పెట్రోల్ అయిపోవడంతో జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకు బండిని నెట్టుకుంటూ వెళ్లానని సుజీత్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత రన్ రాజా రన్ కథను మూడు రోజుల్లో పూర్తి చేశానని సుజీత్ తెలిపారు.

Telugu Career Problems, Sujeeth, Ram Charan, Run Raja Run, Days Cried, Tollywood

ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఎదురైతే ఏ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదని మళ్లీ ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా వస్తుందని సుజీత్ తన లైఫ్ లోని ఎత్తుపల్లాల గురించి వెల్లడించారు.చరణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా రానుందని వార్తలు వస్తుండగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube