ఆ పాట కోసం సిరి వెన్నెల గారిని చాలా ఇబ్బంది పెట్టానంటున్న డైరెక్టర్..... 

గతంలో నందమూరి బాలకృష్ణ మరియు అంజలా జవేరి నటించినటువంటి సమరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

అయితే ఈ చిత్రంలో "అందాల ఆడబొమ్మ" అనే పాట ఇప్పటికీ కొందరికీ తమ ఇష్టమైన పాటల జాబితాలో ఉంటుంది.

అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన టువంటి దర్శకుడు బి.గోపాల్ ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొని ఈ పాటకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే అప్పట్లో ఈ పాట నిమిత్తమై ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ని సంప్రదించారట.

ఇందులో భాగంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి దాదాపుగా 18 పల్లవులకు  పైగా రచించి ఇచ్చినప్పటికీ దర్శకుడు బి.గోపాల్ ఇంకా కావాలి అంటూ శాస్త్రి గారిని అడిగారు.అయితే సీతారామ శాస్త్రి ఏమాత్రం విసుక్కోకుండా దర్శకుడుకి కావలసిన విధంగా పాటను మలచి ఇచ్చాడట.

చివరకు అందాల ఆడబొమ్మ అనే పల్లవిని రచించి దర్శకుడికి ఇవ్వడంతో ఆ పాట మొత్తం సినిమాకే హైలెట్ గా నిలిచి మంచి పేరు తెచ్చింది.దీంతో దర్శకుడు బి.గోపాల్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కష్టానికి కృతజ్ఞతలు తెలిపాడు.అయితే ఈ  పాటకు తగ్గట్టు గానే సంగీత దర్శకుడు మణిశర్మ చేయడంతో మరింత వన్నె అద్దినట్లు అయిందని అన్నారు.

Advertisement

అయితే టాలీవుడ్లోని దాదాపుగా అందరి స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించిన టువంటి దర్శకుడు బి.గోపాల్ ప్రస్తుతం కొంతమేర విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపాడు.అంతేకాక ఏదైనా మంచి తరహా కథాంశం దొరికితే మళ్లీ కచ్చితంగా సినిమా కి దర్శకత్వం వహిస్తానని చెప్పుకొచ్చాడు బి.గోపాల్.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు