చైనా భూగర్భంలోకి చాలా లోతైన రంధ్రం తవ్వుతోంది తెలుసా?

అవును, మీరు విన్నది నిజమే.ఈ మంగళవారం నుంచి చైనా శాస్త్రవేత్తలు అక్కడి భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకాన్ని తవ్వడం మొదలుపెట్టారు.

 Did You Know That China Is Digging A Very Deep Hole Underground ,  Latest News,-TeluguStop.com

దీంతో చైనా(China ) భూగర్భాన్వేషణలో కూడా మరో మైలురాయిని చేరుకోబోతోందని ప్రపంచ దేశాలు భుజాలు తడుముకుంటున్నాయి.కాగా ఈ రంధ్రం సుమారు 10,000 మీటర్ల లోతు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు భూగర్భ నిపుణులు.

చైనాలోని షింజియాంగ్‌( Xinjiang ) ప్రాంతంలో ఈ తవ్వకాన్ని నిన్న మొదలు పెట్టగా ప్రస్తుతం ఈ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Telugu China, Chinese Academy, Earth, Hole, Latest, Telugu Nri, Underground, Dee

ఈ ప్రాజెక్ట్ గాని విజయవంతంగా పూర్తయితే ఆ దేశం తవ్వుతున్న అత్యంత లోతైన రంధ్రంగా ఇది చరిత్రలో నిలవనుంది.ఈ విషయాన్ని తాజాగా చైనాకు చెందిన షిన్హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.మరో వైపు చైనా విజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపిన సంగతి మీరు వినే వుంటారు.

వారిలో దేశ తొలి పౌర వ్యోమగామి గుయ్‌ హైచావో కూడా ఉన్నారు.భూమికి( Earth ) 400 కిలోమీటర్ల ఎత్తులోని తమ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించడం విశేషం.

లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ దీన్ని మోసుకెళ్లిందని భోగట్టా.

Telugu China, Chinese Academy, Earth, Hole, Latest, Telugu Nri, Underground, Dee

ఇకపోతే భూమి పైనా.లోపల ఒకేసారి పరిశోధనలను చైనా షురూ చేసింది.ఈ నేపథ్యంలో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (Chinese Academy of Engineering )శాస్త్రవేత్త సున్‌ జింషెంగ్‌ మాట్లాడుతూ… ”ఈ డ్రిల్లింగ్‌ ప్రాజెక్టు అత్యంత కఠినమైంది.

ఓ భారీ ట్రక్కును రెండు సన్నటి తీగలపై నడిపించినట్లు ఉంటుంది” అని తాజాగా పేర్కోవడం విశేషం.చైనా తాజా తవ్వకాలు భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకొంటూ పోయాయని తెలుస్తోంది.

ఇది దాదాపు 145 మిలియన్‌ సంవత్సరాల వయస్సున్న క్రెటెషియస్‌ పొరను చేరుకోనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube