ద్రౌపతి తన ఐదు మంది భర్తలను ఎలా పొందిందో తెలుసా..?

Mahabharatham, Draupadi, 5 Husbands Story, Kurukshetram, Hindu Spiritual History, Arjuna, Padavulu,

కురుక్షేత్ర మహా సంగ్రామం చివరి దశకు చేరుకున్నప్పుడు, యుద్ధం వల్ల జరిగే నష్టాన్నితలచుకొని ద్రౌపది విచారిస్తోంది.అంతకు ముందు రోజు ఉదయం ద్రౌపది నిద్రిస్తుండగా, ఉపపాండవులను అశ్వత్థాముడు సంహరించిన విషయం నకులుడి ద్వారా తెలుసుకున్న ద్రౌపది తన కుమారుల మరణంతో ఎంతో నిరాశ చెందుతుంది.

 Mahabharatham, Draupadi, 5 Husbands Story, Kurukshetram, Hindu Spiritual History-TeluguStop.com

తన పుత్రుల మరణానికి కారణమైన అశ్వత్థామని పంపవలసిందిగా పాండవులను నిలదీస్తుంది.

ఆ యుద్ధ భూమిలో మరణించిన తమ బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తూ ఉండగా, వారితో పాటు కర్ణుడికి కూడా తిలోదకాలు సమర్పించ వలసిందిగా కుంతిదేవి కోరుతుంది.

అయితే కర్ణుడు తన సొంత కుమారుడని సాక్షాత్తు కుంతీదేవి చెప్పడంతో అక్కడున్నవారంతా ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు.అద్భుత దానశీలిగా, విశిష్ట వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు పొందిన కర్ణుడు తన సోదరుడు అని తెలియడంతో పాండవులు ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతారు.

Telugu Husbands Story, Draupadi, Hindu Spiritual, Kurukshetram, Mahabharatham-La

పూర్వజన్మలో ద్రౌపది వేదవతిగా,మౌద్గల్య మహర్షి భార్య ఇంద్రసేనగా, తరువాత జన్మలో అనామికగా, జన్మించింది.భర్త కోసం తను చేసిన ఘోరమైన తపస్సు మెచ్చిన పరమశివుడు ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా, పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలకడంతో ఆ పరమశివుడు ఆమెకి ఐదుగురు భర్తలను వరంగా ప్రసాదించాడు.ఈమెకు ఐదుగురు భర్తలు ఉన్న అది ధర్మ విరుద్ధం అని ఎవరు భావించరు.కోరుకున్న విధంగానే ఆమెకు ఐదుగురు భర్తలతో కలిసి జీవనం సాగించేందుకు నిత్యయవ్వనంగా, వారిని సేవించడానికి అవసరమైన కన్యత్వం, సౌభాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు వరంగా ద్రౌపదికి ప్రసాదించాడు.

ఈ విధంగా ద్రౌపది ఐదుగురు భర్తలను పొందింది.

ద్రోణుడి చేతిలో ఎంతో అవమానం ఎదుర్కొన్న ద్రుపదుడు తనకు అర్జునుడు లాంటి కొడుకు కావాలని యజ్ఞం చేస్తాడు.ఈ సమయంలో అగ్ని గుండం నుంచి ద్రుపదుడుకి ద్రౌపది లభిస్తుంది. ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్న ద్రుపదుడు, పాండవులు మరణించారన్న వార్త తెలుసుకుని ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తాడు.

కానీ దుర్యోధనుడి కుట్ర నుంచి బయటపడిన పాండవులు స్వయంవరానికి హాజరవుతారు.స్వయంవరం లో గెలిచిన పాండవులు తన తల్లి ఆలోచన కారణంగా సోదరులందరూ ద్రౌపదిని వివాహం చేసుకోవలసి వచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube