సమాజానికి ప్రతి చిన్న విషయంలో ఎదురు తిరగడం అలవాటైపోయింది.ముఖ్యంగా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రతి చిన్న విషయానికి ఆలోచించకుండా తొందరపడి నేరాలకు పాల్పడుతున్నారు.ఎదుట నిలిచిన వ్యక్తి నుండి ఆశించింది రాకపోగా వెంటనే కాల్చి చంపేంత….
స్తితికి దిగజారింది.ఇలాగే ఓ చోట చపాతీలు చల్లగా ఉన్నాయని హోటల్ యజమానిని కాల్చిన ఘటన చోటు చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన అమిత్ చౌహన్, కసుస్తాబ్ సింగ్.వీళ్లిద్దరు కలిసి అర్ధరాత్రి 11 గంటల సమయాన ఆకలితో ఉన్నందున హోటల్ కి వెళ్దాం అనుకున్నారు….ఇంతలో ఆ చుట్టుపక్కల డాబా ఉండగా అందులోకి వెళ్లారు.తినడానికి ఏమీ ఉన్నాయని యజమానిని అడగగా….
చీకటి పడింది కాబట్టి డాబా మూసే సమయంలో ఏమీ లేకపోయేసరికి మిగిలిన చపాతీలు ఉన్నాయని తీసుకొని వచ్చి ఆ ఇద్దరికీ ఇచ్చాడు.

ఇంతలో కసుస్తాబ్ సింగ్ అనే వ్యక్తి చపాతీలు చల్లగా ఉన్నాయని యజమాని పై మండిపడ్డాడు.దీంతో ఇద్దరి మధ్య పెద్ద వాదన జరుగగా… కసుస్తాబ్ తన వెంట తెచ్చుకున్న తుపాకిని జేబులో నుంచి తీసి వెంటనే ఆ యజమాని తొడపై కాల్చివేసాడు.దీంతో చుట్టుపక్కల ఉన్న కొందరు యజమానిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.వైద్యులు చికిత్స చేసి బుల్లెట్ ను తీశారు.దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.తదుపరి ఆ ఇద్దరు వ్యక్తుల పై పోలీసులు కేసును దర్యాప్తు చేసి వాళ్ల ను అదుపులోకి తీసుకున్నారు.
ఇంత చిన్న విషయానికి కూడా నేటి సమాజం ఆలోచించకుండా ఎవరిని పడితే వాళ్లను చంపేంత స్థితికి దిగజారింది.
వారికి ఆయుధ సదుపాయాలను కల్పించినందుకు ముందుగా ప్రభుత్వాన్ని నిలదీయాలి.ఇష్టం వచ్చిన వాళ్లకి ఇలాంటి ఆయుధాలను లైసెన్స్ తో సహా అందిస్తున్నందుకు చట్టం దృష్టిలో న్యాయం ఎంతవరకు ఉందో అర్థమవుతుంది.