దేవర మూవీ ( Devara movie )థియేటర్లలో విడుదలై 25 రోజులైంది.గత నెల 27వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలైన దేవర మిక్స్డ్ టాక్ తోనే బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
దసరాకు రెండు వారాల ముందే పెద్దగా పోటీ లేకుండా థియేటర్లలో విడుదలైన దేవర మూవీ కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొట్టిందనే చెప్పాలి.హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో దేవర మూవీ సత్తా చాటడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
23 రోజుల్లోనే హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం.ఎం.లో ( Sudarshan in 35 mm )కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన దేవర హైదరాబ్కాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న విశ్వనాథ్ థియేటర్ ( Vishwanath Theatre )లో సైతం కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది.ఈ రెండు థియేటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయినప్పటికీ దేవర మాత్రం కలెక్షన్లతో సంచలనాలు సృష్టించిందనే చెప్పాలి.
రాబోయే రోజుల్లో దేవర ఖాతాలో మరిన్ని రికార్డ్స్ చేరతాయేమో చూడాలి.
ప్రస్తుతం థియేటర్లలో సరైన సినిమా లేదనే చెప్పాలి.దీపావళి పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి.ఆ సినిమాలు విడుదలయ్యే వరకు దేవరకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని చెప్పవచ్చు.
దేవర సృష్టిసున్న రికార్డులు చూసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమా ( War2 movie )షూట్ తో బిజీగా ఉన్నారు.
వార్2 మూవీకి యుద్ధభూమి అనే టైటిల్ ఫిక్స్ అవుతుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వినిపిస్తోంది.ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను పెంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు.