మరో 36 గంటల్లో స్టార్ హీరో ప్రభాస్( Star hero Prabhas ) పుట్టినరోజు జరుపుకోనున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే.
ప్రభాస్ కు జపాన్ అభిమానులు వెరైటీగా విషెస్ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.జపాన్ అభిమానుల అభిమానానికి ఫిదా అవ్వాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తర్వాత సినిమాలతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకున్నారు.జపాన్ ( Japan )లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఫ్యాన్స్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.టోక్యో రెబల్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి విషెస్ తెలిపారు.
ఒక స్టార్ హీరో పుట్టినరోజుకు మరో దేశంలో ఈ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అరుదుగా మాత్రమే జరుగుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇండియాలో కూడా ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి.ప్రభాస్ బర్త్ డే కానుకగా ఏకంగా 6 సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి.ఈ స్థాయిలో సినిమాలు రీరిలీజ్ కావడం ప్రభాస్ కు మాత్రమే జరిగిందని చెప్పవచ్చు.
ప్రభాస్ భిన్నమైన ప్రాజెక్ట్ లకు ఓటు వేస్తుండగా ఆ సినిమాలు సైతం అంచనాలను మించి సక్సెస్ సాధిస్తున్నాయి.స్టార్ హీరో ప్రభాస్ భవిష్యత్తు సినిమాల కోసం పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.ప్రభాస్ ఖాతాలో చేరుతున్న ఘనతలు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయనే చెప్పాలి.స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.