సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన శాకుంతలం మూవీ( Shakuntalam ) ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.ఈ సినిమా దిల్ రాజు సినీ కెరీర్ లో ఆయనకు భారీగా నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కించడం కూడా ఈ మూవీ భారీ నష్టాలకు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.శాకుంతలం రిజల్ట్ తో సంబంధం లేకుండా సమంత( Samantha ) లండన్ కు వెళ్లిపోయారు.
శాకుంతలం సినిమాలో దుశ్యంతుడి పాత్రలో నటించిన దేవ్ మోహన్( Dev Mohan ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతతో రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.టాప్ స్టార్లతో కలిసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని దేవ్ మోహన్ తెలిపారు.
అయితే స్క్రిప్ట్ మాత్రమే నన్ను ఎక్కువగా ఎగ్జైట్ చేస్తుందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కంటెంట్ కే అని దేవ్ మోహన్ తెలిపారు.కథకు కనెక్ట్ అయితే మాత్రమే నేను సినిమాలో నటిస్తానని ఆయన కామెంట్లు చేశారు.శాకుంతలం మూవీ నా కెరీర్ లో మూడో సినిమా అని దేవ్ మోహన్ చెప్పుకొచ్చారు.
శాకుంతలంలో నటించడం గొప్ప ఛాన్స్ అని అయన కామెంట్లు చేశారు.సమంత కో స్టార్ ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని దేవ్ మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
నా కో స్టార్ ను తొలి ప్రేక్షకుడిలా ఫీలవుతానని ఆయన వెల్లడించారు.సామ్ తో రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో నెర్వస్ గా ఫీల్ కాలేదని దేవ్ మోహన్ తెలిపారు.ఆ సీన్స్ సమయంలో నాకు సమంత కనిపించలేదని శకుంతల మాత్రమే కనిపించిందని దేవ్ మోహన్ తెలిపారు.దేవ్ మోహన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.