దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.