బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలిసిందే.
ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అందువల్లే ఈమెకు పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో వరుస సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
దీపికా పదుకొనే డ్రెస్సింగ్ స్టైల్ అంటే కూడా చాలామందికి ఇష్టమే.
ఈమె తన డ్రెస్సింగ్ స్టైల్ కి కుర్రకారు ఫిదా అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే ఇదే విషయంలో తాజాగా ట్రోలింగ్స్ ను ఎదుర్కొంది దీపిక.తాజాగా ఈమె ఒక ప్రైవేట్ ఎయిర్ పోర్టులో మీడియా కంట పడటంతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలో ఆమె బ్లూ డెనిమ్ జాకెట్, లైట్ బ్లూ కలర్ డెనిమ్ ప్యాంట్ ధరించింది.
ఈ ఫోటోలో ఆమె కాళ్లకు హీల్స్ అలాగే సాక్స్ కూడా వేసుకుంది.
ఈ ఫోటో పై నెటిజన్స్ ట్రోలింగ్ చేశారు.
భర్త రణ్ వీర్ సింగ్ బట్టలు వేసుకొచ్చావా అని కొందరు కామెంట్ చేయగా.ఇంకొందరు సాక్సులతో హీల్స్ వేసుకోవడం స్టైల్ అనుకుంటుందా అని కామెంట్ పెట్టారు.ఇలాంటి ఫ్యాషన్ ఎవరు ఫాలో కావద్దు.
అంటూ విమర్శిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.