ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.
సౌత్ మరియు హిందీలో వేరు వేరుగా పాటలను విడుదల చేస్తున్నారు.ఇప్పటికే రెండు వర్షన్ ల మ్యూజిక్ ను రెడీ చేయించారనే వార్తలు వచ్చాయి.
ఆ వార్తలు నిజమే అన్నట్లుగా ప్రభాస్ రాధే శ్యామ్ మొదటి పాట సౌత్ లో కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు.ఇప్పుడు హిందీలో ఆషికి ఆగయీ అంటూ పాటను విడుదల చేయడం జరిగింది.
భారీ స్థాయిలో ఈ పాటకు హైప్ వచ్చింది.దాంతో అత్యధిక వ్యూస్ ను ఈ పాట దక్కించుకుంది.
ఇప్పటి వరకు బాలీవుడ్ లో విడుదల అయిన ఏ పాటకు కూడా దక్కని అనూహ్యమైన రెస్పాన్స్ ఈ పాటకు దక్కింది.

కేవలం 15 నిమిషాల్లో ఈ పాట ఏకంగా 1000 కే లైక్స్ ను దక్కించుకుంది.ఇంత తక్కువ సమయంలో లక్ష లైక్స్ ను దక్కించుకున్న పాటగా ఇది రికార్డు సాధించింది.సౌత్ లో ఈ రికార్డులు కామన్ కాని హిందీలో మాత్రం ఇది ఖచ్చితంగా అరుదైన పెద్ద రికార్డు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
బాలీవుడ్ లో ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చాలా వచ్చాయి.ఆ సినిమాల పాటలు భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా మాత్రమే ఇలా పాటల విషయంలో రికార్డును దక్కించుకుంది.
ప్రతి ఒక్క ఇండియన్ సినీ అభిమాని ఈ సినిమా కోసం పాటల కోసం ఎదురు చూస్తున్నారు అని దీంతో వెళ్లడయ్యింది. రాధే శ్యామ్ తో ప్రభాస్ 500 ల కోట్ల క్లబ్ లో మరోసారి చేరుతాడనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాను యూవీ వారు నిర్మించిన విషయం తెల్సిందే.