నేషనల్ అవార్డు అందుకున్న పుష్ప... వెల్ డన్ అంటూ వార్నర్ విషెస్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తాజాగా పుష్ప సినిమా(Pushpa Movie) ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఏకంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు.

 David Warner Wish To Allu Arjun For National Award Winning Details, Allu Arjun,-TeluguStop.com

తాజాగా ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈయన జాతీయ అవార్డును (National Award) అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరో కూడా ఇలాంటి జాతీయ అవార్డును పొందలేదు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Alluarjun, David, National Award, Pushpa, Su

ఇలా మొదటిసారి జాతీయ అవార్డు పొందినటువంటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు.ఈ క్రమంలోనే ఈయన ఈ అవార్డును అందుకోవడంతో ఎంతోమంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇకపోతే పుష్ప సినిమా విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ మేనరిజాన్ని దింపుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అల్లు అర్జున్ డైలాగ్స్ తో పాటు పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్స్ వేస్తూ అందరిని పెద్ద ఎత్తున సందడి చేసినటువంటి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కూడా బన్నీకి శుభాకాంక్షలు తెలియచేశారు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Alluarjun, David, National Award, Pushpa, Su

జాతీయ అవార్డును సొంతం చేసుకున్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అందరూ కూడా ఓకే ప్రేమ్ లో కనిపించారు.ఇందుకు సంబంధించినటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కంగ్రాజ్యులేషన్స్ అండ్ వెల్​ డన్​ అని స్టోరీలో రాసుకొచ్చాడు వార్నర్.అయితే వార్నర్, అల్లు అర్జున్​కు శుభాకాంక్షలు తెలుపడం వల్ల బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.ఇక అల్లు అర్జున్ సైతం జాతీయ అవార్డును అందుకున్నటువంటి తరుణంలో ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంపై కూడా భారీగానే అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube