దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కి విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది.నేటి (గురువారం) నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
మూలానక్షత్రం మైనా ఈ నెల 12న కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజున వన్ టౌన్ పోలీసులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
ఆ తర్వాత రోజుల్లో నగర పోలీసు కమిషనర్ సమర్పించేవారు.ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ( సీపీ) బత్తిన శ్రీనివాసులు కుటుంబ సమేతంగా బుధవారం రాత్రి ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వేదపండితులు అర్చకులు సుప్రభాతసేవతో అమ్మవారిని మేల్కొల్పి శాస్త్రోక్తంగా స్నపభిషేకం, బాలభోగ నివేదిన, నిత్యర్చనలు చేస్తారు.అనంతరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఆ తర్వాత రోజు నుంచి తెల్లవారు జామున 4 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు.అమ్మవారి దర్శనానికి రోజుకు పదివేల మందిని మాత్రమే అనుమతిస్తారు 4 వేల మందికి ఉచితంగా.మూడు వేల మందికి రూ.100, రూ.300 టికెట్ల తో దర్శనం కల్పించనున్నారు.

ఆన్ లైన్ టికెట్ లేకుండా వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు దర్శనం టిక్కెట్లు విక్రయించేందుకు విఎంసి కార్యాలయం ఎదుట, పున్నమి ఘాట్ వద్ద, టోల్గేట్ వద్ద కరెంట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.కరోనా కారణంగా అంతరాల దర్శనాలను రద్దు చేసి లఘు దర్శనం ఏర్పాటు చేశారు.రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నాడు గురువారం ఎందుకు కీలాద్రిపై శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి అలంకరణలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
గవర్నర్ రానందున ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.