నేటి టెక్నాలజీ కాలంలో రెగ్యులర్‌గా నిద్ర మాత్రలు వేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, ఆందోళన, ముబైల్స్‌ను ఓవర్‌గా వినియోగించడం, పోషకాల కొరత ఇలా రకరకాల కారణాల వల్ల నిద్ర లేమికి గురవుతుంటారు.
దాంతో నిద్ర లేమికి పరిష్కారంగా నిద్ర మాత్రలను ఎంచుకుంటారు.కానీ, నిద్ర లేమికి నిద్ర మాత్రలు ఎప్పుడూ పరిష్కారం కాదు.
పైగా నిద్ర మాత్రలను ప్రతి రోజు వాడటం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆ సమస్యలేంటో లేట్ చేయకుండా చూసేయండి.
నిద్ర మాత్రలు వాడటం వల్ల తాత్కాలికంగా నిద్ర సమస్యలు దూరం అవుతాయి.కానీ, అదే సమయంలో మెదడు పని తీరు కూడా క్రమ క్రమంగా నెమ్మదిస్తుంది.దాంతో తక్కువ వయసులోనే మతిమరుపు, ఆలోచనా శక్తి నశించడం వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అలాగే రెగ్యులర్‌గా నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది.
దాంతో మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి, ఎసిడిటీ, ఆకలి తగ్గి పోవడం వంటివి తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ప్రతి రోజు నిద్ర మాత్రలు వేసుకుంటే తల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది.
కంటి చూపు మందగించడం, మైకంగా అనిపించడం, అలసట, అధిక దాహం, శరీరం బలహీనంగా మారి పోవడం వంటివి కూడా జరుగుతుంటాయి.
నిద్ర మాత్రలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె మరియు మూత్ర పిండాల ఆరోగ్యం విపరీతంగా పాడవుతుంది.దాంతో గుండె సంబంధిత జబ్బులు మరియు కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాదు, రోజూ నిద్ర మాత్రలు తీసుకుంటే క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మ అలర్జీలు, తరచూ ఒత్తిడికి గురి కావడం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి, ఇకపై అయినా నిద్ర మాత్రలను వేసుకోవడం తగ్గించుకోండి.అదే మీ ఆరోగ్యానికి మంచిది.