ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకునే అమెరికా కరోనా ధాటికి విలవిలలాడిపోయిన ఘటన ప్రత్యక్షంగా చూశాం.ఎక్కడ చూసినా శవాల దిబ్బలతో, కరోనా మహమ్మారి కాటుకు బలై పోయి అనాధలుగా ముక్కుమ్మడి దహన సంస్కారాలు చేపట్టారు.
తలుచుకుంటే అప్పటి పరిస్తితితులు ఇప్పటికి కళ్ళ ముందు కదలాడుతుంటాయి.సెకండ్ వేవ్ సమయంలో అమెరికా కాస్త కుదుట పడినా, థర్డ్ వేవ్ సమయానికి మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతూ వచ్చింది.
అయితే బిడెన్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా ప్రారంభించడం వలన కొంత మేరకు కరోనా ను కంట్రోల్ చేయగలిగారు…కానీ
అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా మొదటి వేవ్ సీన్ రిపీట్ అవుతుందా అన్నట్టుగా ఉందని ఆందోళన చెందుతున్నారు వైద్య నిపుణులు.గడిచిన కొన్ని నెలలుగా అమెరికాలో కరోనా కేసులు సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోందని హాస్పటల్స్ లో బెడ్స్ నిండుకుంటున్నాయని వైద్యులు అంటున్నారు.
అలాగే రోగ తీవ్రత కేసుల సంఖ్య ఎక్కువగా అవ్వడంతో ఐసియూ లో బెడ్స్ కుడా నిండిపోతున్నాయని రోగులకు వైద్య సదుపాయాలు ఇవ్వలేని పరిస్థితిలో తాము ఉన్నామని వైద్యులు ఆవేదన చెందుతున్నారు.
అమెరికాలోని 15 రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితి గత ఏడాది తో పోల్చితే మరింత దారుణంగా ఉందని అక్కడ బెడ్స్ , వైద్య పరికరాల అవసరం ఎక్కువగా ఉందని వాపోతున్నారు.మిచిగాన్ లో 41 శాతం ఐసియూ బెడ్స్ నిండుకోగా రోగులు వస్తుంటే ఏం చేయాలో పాలు పోవడం లేదని అంటున్నారు.ఇదిలాఉంటే మరో పక్క ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి వైద్య సేవలు అందించలేక పోతున్నామని వాపోతున్నారు.
గడిచిన మూడు నెలల కాలంగా రోజుకు కరోనా తో మృతి చెందే వారి సంఖ్య 1000 కి చేరుకుందని ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కరోనా కేసుల సంఖ్య తీవ్రం అవుతుందని దాంతో మొదటి వేవ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయని, అయితే ఇప్పటి వరకూ వస్తున్నా కేసులలో వ్యాక్సినేషన్ చేసుకోని కేసులే అత్యధికంగా వస్తున్నాయని తెలిపారు.