రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు రాష్ట్ర హైకోర్టులు నోటీసులు ఇచ్చింది.ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లాట్ వివాదాదస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.
న్యాయస్థానాల్లో అవినీతి పెరిగిపోయిందంటూ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా చాలా మంది లాయర్లు తీర్పును రెడీ చేసి కోర్టులకు అందిస్తున్నారన్న ఆయన అదేవిధంగా ధర్మాసనాల్లో తీర్పు కూడా వస్తోందంటూ కామెంట్లు చేశారు.
అయితే ఈ ఆరోపణలను సుమోటాగా తీసుకుంటూ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఓ న్యాయాధికారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన రాజస్థాన్ హైకోర్టు నోటీసులు ఇచ్చి మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.