1998 నాటి ఆడి కారు దిగుమతి కుంభకోణం కేసులో పాతికేళ్ల తర్వాత ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తకు కోర్టులో ఊరట లభించింది.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైనందున ముంబైలోని ఎస్‌ప్లానేడ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్ట్ గత వారం ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తను నిర్దోషిగా ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే.ఆషియా మోటార్స్ యజమాని, ముంబైకి చెందిన కార్ డీలర్ సాదిక్ ఫుటేహల్లి ఈ దిగుమతి కుంభకోణానికి కేంద్రంగా వ్యవహరించాడని డీఆర్ఐ అభియోగాలు మోపింది.
కేసు విచారణ సాగుతుండగానే ఫిబ్రవరి 5, 2009న సాదిక్ మరణించారు.
1987 నుంచి 1989 మధ్య ఆషియా మోటార్స్ భారతదేశానికి ఆడికార్లను దిగుమతి చేసింది.ఆ రోజుల్లో మనదేశంలో అమల్లో వున్న దిగుమతి విధానం ప్రకారం.విదేశాలలో వున్న ఎన్ఆర్ఐలకు మాత్రమే కార్లను దిగుమతి చేసుకునేందుకు అనుమతి వుండేది.
అయితే ఫుటేహల్లీ దిగుమతి చేసుకున్న చాలా కార్లకు సంబంధించి.విదేశీ ఆదాయాలు , చెల్లింపులకు చెందిన ఆధారాలు లేవు.
అంతేకాకుండా కార్లు అధిక సామర్ధ్యానికి చెందినవి కావడంతో పాటు వాటి ధరలు తప్పుగా ప్రకటించబడ్డాయని ప్రాసిక్యూషన్ తెలిపింది.అలాగే ఇన్వాయిస్‌లలో తక్కువ విలువను చూపించినట్లు పేర్కొంది.
విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకునేందుకు గాను ఆషియా మోటార్స్ సంస్థ.సుశీల్ జాలీ అనే వ్యక్తి తన పేరు, పాస్‌పోర్ట్, ఇతర వివరాలను పరిగణనలోనికి తీసుకున్నాడు.
అనంతరం కార్లు ఆషియా మోటార్స్‌కు బదిలీ చేయబడ్డాయి.ఆ సమయంలో వున్న నిబంధనల ప్రకారం.
అటువంటి బదిలీకి అనుమతి లేదని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
అయితే వారి పేర్లను ఉపయోగించడానికి అనుమతించినందుకు గాను ఫుటేహల్లీ . సదరు వ్యక్తులకు కమీషన్ చెల్లించారని ప్రాసిక్యూషన్ పేర్కొంది.ఆడితో పాటు జపాన్‌కు చెందిన ఒసాకా.
జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్‌కి ఫుటేహల్లి చెల్లింపులు చేస్తోందని విచారణలో తేలింది.అలాగే ఒసాకా కంపెనీలో ఈ సంస్థకు 20 శాతం వాటా వుందని దర్యాప్తు అధికారులు తేల్చారు.
ఈ కుంభకోణానికి సంబంధించి అక్టోబర్ 6, 1998న ఫిర్యాదు దాఖలైంది.అయితే ఈ కేసులో అభియోగాలు మాత్రం జనవరి 30, 2023న రూపొందించబడ్డాయి.
ఇక ప్రాసిక్యూషన్ ఒక సాక్షిని , దర్యాప్తు అధికారిని విచారించింది.