చండీఘడ్ పోలీసుల చేతిలో కొత్త పరికరం, సులువుగా కరోనా రోగులను

కరోనా ఎక్కడ చూసినా,ఎవరి నోట విన్నా కూడా ఈ కరోనా పేరే వినిపిస్తుంది.సామజిక దూరం పాటించకపోతే ఈ కరోనా మహమ్మారి ఒక్కరి వల్ల ఎంతమందికి వ్యాపిస్తుందో అందరికి తెలిసిందే.

 Cahndigarh Police Devises A Corona Trap To Tackle Suspected Patients And Lockdow-TeluguStop.com

అందుకే వీరికి వైద్యం అందిస్తున్న వైద్యులు,వీరిని వెతికి పట్టుకుంటున్న పోలీసులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎదో రకంగా ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఎవరూ బయటకు రావద్దు అని ఇండ్లలోనే ఉండమని లాక్ డౌన్ విధించి మరి ప్రభుత్వాలు కోరుతున్నప్పటికీ జనాలు మాత్రం రోడ్లపై తిరుగుతూ ఒకరి వల్ల నలుగురు ఈ మహమ్మారి బారిన పడే పరిస్థితులు తీసుకువస్తున్నారు.

ఇలాంటివారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.అలానే కరోనా పాజిటివ్ తేలిన వారిని హాస్పిటల్ కు తరలించాలి అన్నా కూడా పెద్ద రిస్క్ గా పోలీసులకు తయారైంది.

ఈ నేపథ్యంలో చండీఘడ్ పోలీసుల చేతిలో కొత్త పరికరం ఒక్కటి అందుబాటులోకి వచ్చింది.ఇంతకీ ఆ పరికరం ఏంటంటే ‘కరోనా ట్రాపర్’.

దీని సాయంతో పోలీసులు లాక్‌డౌన్ ఉల్లంఘులు లేదా కరోనా వైరస్ అనుమానితుల వద్దకు వెళ్లకుండానే దూరం నుంచి పట్టేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్లను వ్యాన్ లేదా అంబులెన్సు ఎక్కించేయవచ్చు.

ఈ పరికరాన్ని ‘కరోనా ట్రాపర్’ అని అంటారు.డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ బనివాల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించారు.

దీనికి సంబందించిన ఒక వీడియో ను కూడా ఆ అధికారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఆ వీడియో లో స్వీయ నిర్బంధానికి నిరాకరించిన ఒక వ్యక్తి ని పోలీసులు ఈ కరోనా ట్రాపర్ ని ఉపయోగించే పట్టుకొని అంబులెన్స్ లో బంధించారు.

ఈ కరోనా ట్రాపర్ వల్ల కరోనా అనుమానితులతో పోలీసులు సామజిక దూరం పాటించే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube