చీరలు వెనక్కి తీసుకోలేదని షోరూం వాడికి జరిమానా... ఎక్కడంటే?

మగువలకు ఈ ప్రపంచంలో అత్యంత ఇస్టమైంది ఏమిటని అడిగినపుడు వారు తడుముకోకుండా చీరలు( Sarees ) అని చెబుతారు.అవును… చీరలకు, మగువలకు విడదీయలేని ఓ బంధం వుంటుంది మరి.మరీ ముఖ్యంగా మనదేశ మహిళలకు( Women ) చీరలంటే ఎక్కువ ప్రీతి.ఎందుకంటే ఆ కట్టు బొట్టు మన భారతీయ సంప్రదాయాలలోనే దాగి వుంది కాబట్టి.

 Consumer Commission Orders Gujarat Textile Company With Daily Fine Details, Sare-TeluguStop.com

అందుకే అనాదినుండి మన ఆడవాళ్ళ కట్టు బొట్టులో చీర అనేది ఇమిడిపోయింది.అలాంటి చీరను మహిళలు చాలాసార్లు పరికించి చూసి మరీ కొనుగోలు చేస్తూ వుంటారు.

ఏమాత్రం డ్యామేజ్ వున్నా తిరిగి ఆ చీరను ఆ షాపు ఓనర్ ముఖాన కొడతారు.ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఇక ఆ షాపు ముఖం జన్మలో చూడరు.

Telugu Fine, Gujarattextile, Rajesh Borade, Return, Sarees, Srivinayak, Supplier

అందుకే తెలివిగా వ్యాపారులు వారితో చాలా మర్యాదపూర్వకంగా మసలుకుంటారు.ఎన్నిసార్లు నచ్చని చీరని రిటర్న్ ఇచ్చినా వెనక్కి తీసుకుంటూ వుంటారు.మరి అలా తీసుకోకపోతే ఏం జరుగుతుందో అనే దానికి తాజా సంఘటనే ఓ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.అసలు విషయంలోకి వెళితే, గుజరాత్‌కు( Gujarat ) చెందిన టెక్స్‌ టైల్ కంపెనీ కస్టమర్ల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని అన్యాయమైన వ్యాపారాన్ని చేస్తోందని పేర్కొంటూ, ఆ సంస్థ నుంచి చీరల కొనుగోలుకు ఖర్చు చేసిన రూ.27వేల 600 తిరిగి చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించడం ఇపుడు చర్చనీయాంశమైంది.

Telugu Fine, Gujarattextile, Rajesh Borade, Return, Sarees, Srivinayak, Supplier

ఇక ఆ మొత్తాన్ని రీఫండ్( Refund ) చేసే వరకు కంపెనీపై రోజువారీ జరిమానా రూ.25 విధించబడుతుందని కూడా హెచ్చరించింది.ఫిర్యాదుదారుకు మానసిక వేదన, వ్యాజ్యం ఖర్చు కోసం రూ.16వేలు పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించడం కొసమెరుపు.శ్రీ వినాయక్ టెక్స్‌టైల్స్‌ పై( Sri Vinayak Textiles ) విక్రోలి నివాసి రాజేష్ బోరాడే ఫిర్యాదుపై కమిషన్ అధ్యక్షుడు రవీంద్ర నాగ్రే, సభ్యుడు ఎస్‌వి కలాల్ అక్టోబర్ 5 నాటి ఉత్తర్వులను దానికి ఆపాదించారు.

వినాయక్ నుంచి కొనుగోలు చేసిన చీరలు కస్టమర్ కి నచ్చలేదు.దాంతో అతను వాపసు కోరాడు.కానీ దాన్ని సంస్థ ససేమిరా పట్టించుకోలేదు.ఈ విషయంలోనే కస్టమర్ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం లేదా డబ్బు వాపసు చేయకపోవడం సేవలో లోపమేనని కమిషన్ ఈ సందర్భంగా పేర్కొంది.

ఆర్డర్ నుంచి 30 రోజులలోపు పరిహారం చెల్లించకపోతే, అది సంవత్సరానికి 6% వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube