వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆ రాష్ట్రాల్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.తాము పేదల పక్షాన ఉన్నాం కాబట్టే తమను గెలిపిస్తారని తెలిపారు.
ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల ప్రయోజనాల కోసమే బీజేపీ పని చేస్తోందని విమర్శించారు.