చిన్నతనంలో హాయిగా స్కూల్ కి వెళ్లి ఫ్రెండ్స్‌తో ఆడుకునే అదృష్టం చాలామందికి ఉంటుంది.కొంతమంది పిల్లలు మాత్రం పేదరికం వల్ల పాఠశాలకు వెళ్లకుండా వీధుల్లో వస్తువులను విక్రయించాల్సిన దుస్థితి వస్తుంది.
చిన్న వయసులో ఇంత కష్టపడి పనిచేస్తున్న వారిని చూస్తుంటే బాధగా అనిపించడం సహజం.
అయితే ఇలాంటి హార్ట్ బ్రేకింగ్ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు( Ahmedabad ) చెందిన ఓ చిన్న పిల్లవాడు( Small Boy ) వీధిలో కీచైన్లు ( Selling Keychains ) అమ్మడం ఈ వీడియోలో చూడవచ్చు.సాక్షి అనే మహిళ జూన్ 7న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 74 లక్షల వ్యూస్ పొందింది.
ఈ వీడియో ప్రకారం, ఆ పిల్లోడు ఫుట్‌పాత్‌పై కూర్చుని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కార్లలో ఉన్న వ్యక్తులకు కీచైన్లను విక్రయించడానికి ప్రయత్నించాడు.అలాగే ఈ చిన్నారి కుడి పాదానికి గాయమైనట్లు కనిపించింది.
అతను దానిని గుడ్డ, ప్లాస్టిక్‌తో కవర్ చేసుకున్నాడు.కల్మషం లేని ఈ పిల్లోడి ముఖం చాలా మందిని భావోద్వేగానికి గురిచేసింది.
ఈ వీడియోను చూసిన చాలా మంది ఆ బాలుడికి సహాయం చేయాలని కోరారు.భిక్షాటన చేయకుండా కష్టపడేందుకు ప్రయత్నిస్తున్న ఆ బాలుడిని గౌరవిస్తున్నామని కొందరు వీడియోపై వ్యాఖ్యానించారు.ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా అతనికి సహాయం చేయాలని ఇతరులను కూడా కోరారు.గాయపడినప్పటికీ పనిని ఎంచుకున్నందుకు మరికొందరు బాలుడిని మెచ్చుకున్నారు.ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియోని మీరు కూడా చూడండి.