జూబ్లీహిల్స్ రోడ్ no45లోని అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో ఇండ్లని కట్టుకునేందుకు బస్తీవాసుల యత్నం.కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ సిబ్బంది.
ఉద్రిక్తత .పోలీసులు, సిబ్బందితో బస్తీవాసుల వాగ్వాదం.అంబేద్కర్ బస్తీవాసులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకురాలు విజయ రెడ్డి,జూబ్లీహిల్స్ నియోజకవర్గ బిజెపి నాయకులు బస్తీవాసులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయింపు.భారీగా మోహరించిన పోలీసులు బస్తీవాసులు ధర్నా చేస్తున్న సందర్భంగా అక్కడికి చేరుకున్న స్థానిక టిఆర్ఎస్ కార్పొరేటర్ వెంకటేష్ ను, అడ్డుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి కార్పొరేటర్ వెంకటేష్ను పంపించివేశారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు గోవర్ధన్ , గౌతం రావు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలను అధికార పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడడం క్షమించరాని నేరం అని అన్నారు.పేదలకు ఇల్లు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు విజయ రెడ్డి, రోహన్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తే వాటిని ఆక్రమణకు గురి చేయడం సరైన పద్ధతి కాదని పేదలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.