భార్య ఎఫెక్ట్ ! దామోదర రాజనర్సింహ పదవి ఊడబోతోందా...?

కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరసింహ భార్య పద్మిని రెడ్డి కి కాంగ్రెస్ తరఫున సంగారెడ్డి టికెట్ అడిగినా పార్టీ నిరాకరించినందునే రాజనర్సింహ ఆమెను బీజేపీ గూటికి చేర్చారనే చర్చ నడుస్తోంది.దీని ద్వారా ఆ స్థానంలో పోటీ చేయనున్న జగ్గారెడ్డిని ఓడిస్తే… కేసీఆర్ పార్టీకి మేలు జరుగుతుంది.

 Congress Leader C Damodars Wife Padmini Reddy Joins Bjp-TeluguStop.com

బీజేపీతో కలసి కేసీఆర్ ఈ సారి మళ్లీ అధికారంలోకి వస్తే, రాజనర్శింహ భార్య గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని, లేకపోతే నామినేెటెడ్ పదవి అయినా ఇస్తారని, ఆ మేరకు టీఆర్ఎస్, బీజేపీ, రాజనర్సింహ మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రకారమే పద్మినీరెడ్డిని బీజేపీలో చేర్చారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ మొదటి విడత విడుదల చేసిన 34మంది అభ్యర్ధుల జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్ధులకు టికెట్లు కేటాయించారు.సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారుడు, ఉత్తమ్ కుమార్ ఆయన భార్యకు, కోమటిరెడ్డి బ్రదర్స్ కు టికెట్లు కేటాయించారు.కానీ దామోదర రాజనర్సింహకు అలాంటి అవకాశం దక్కలేదు.

దీంతో ఆయన కేసీఆర్, బీజేపీతో ఒప్పందం కుదుర్చుకునే తన భార్య పద్మిని రెడ్డిని బీజేపీలో చేర్చారని చర్చ జోరుగా సాగుతోంది.అయితే ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికివచ్చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఈ విషయం పై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉంది.

మీరు కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉంటూ.

మీ భార్యను బీజేపీలో చేర్చారు.? జనం మరీ పిచ్చివాళ్లులాగా కనిపిస్తున్నారా ? అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు కదా ! అంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై తెలంగాణ కాంగ్రెస్ నేత, ఉమ్మడి రాష్ట్ర డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసహనం వ్యక్తం చేశారు.అది తమ కుటుంబ విషయమని చెప్పుకొచ్చారు.మీకు పని లేదా అంటూ మీడియాపై చిర్రుబుర్రులాడారు.

సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని ఓడించడానికే టీఆర్ఎస్, బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో ఇలా చేశారా ? అని ప్రశ్నించినందుకు ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చేసింది.మీరు ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది కదా ? మీరు రూపొందిస్తున్న మ్యానిఫెస్టోపై మీ భార్యకే నమ్మకం లేదా ? అందుకే ఆమె ఇతర పార్టీలోకి వెళ్లిపోయారా ? మరి మీరు ఎప్పుడు పార్టీ మారతారు ? అంటూ నెటిజన్లు ఇప్పటికే దామోదరను ఓ ఆట ఆడుకుంటున్నారు.

అయితే ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది.ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే ఎన్నికల ప్రచారంలో చాలా అభాసుపాలవుతామని… అందుకే తెలంగాణ ముఖ్య నాయకులతో ఒకసారి చర్చించి రాజనరసింహ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube