సెంటు పట్టాతో పాటు ఒక పడవ కూడా ఇవ్వాలి - పోతిన వెంకట మహేష్

సెంటు పట్టా తో పాటు ఒక పడవ కూడా ఇవ్వాలి.వర్షం వరద వస్తే వెలగలేరులో జగనన్న కాలనీలో ఆరు నెలలు మాయమవుతాయి.

 Janasena Pothina Venkata Mahesh Satirical Comments On Jagananna Colonies, Janase-TeluguStop.com

మెయిన్ రోడ్డు నుండి జగనన్న కాలనీలోకి వెళ్లడానికి బుడమేరు ప్రభావం వలన రోడ్డు తెగిపోయి రాకపోకలు వారం రోజుల నుండి పూర్తిగా స్తంభించిపోయాయి.విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు వెలగలేరులో కేటాయించిన కాలనీలో నేటి వరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు.

పశ్చిమంలో సెంటు భూమి ఇళ్ళ నిర్మాణం పూర్తయినవి” 0″ అంటే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు పేదల ఇళ్ళ నిర్మాణంపై దృష్టి లేదు ఎంతసేపు ప్రభుత్వ భూముల కబ్జా పైన దేవాలయాల్ని దోచేసి అవినీతి సొమ్ము కూడపెట్టడం పైనే ఉంది.ప్రస్తుత పరిస్థితిని చూసి మహిళలు కన్నీరు మున్నేరు అవుతూ సీఎం జగన్ పై శాపనార్ధాలు పెడుతున్నారు.

జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాదు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాడు అందుకే జోగి రమేష్ ని తార్చే వాడు అంటారు.

పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన పిలుపుమేరకు జగనన్న కాలనీలో వాస్తవ పరిస్థితులను మరియు పేదలు ఎలా పేరుతో వైసిపి చేస్తున్న స్కీమును ప్రపంచానికి చూపించే విధంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా, వెలగలేరు వద్ద కేటాయించిన జగనన్న కాలనీను పశ్చిమ నియోజకవర్గ నాయకులు వీర మహిళలు జనసైనికులతో కలసి సందర్శించడం జరిగింది.

జగనన్న కాలనీలో వాస్తవ పరిస్థితుల తీరును నిరసిస్తూ వినూత్న పద్ధతిలో చేపలు పడుతూ, కాలనీలో నీళ్లు నిండిపోవడం వలన పేపర్ పడవలు వదిలి వినూత్నంగా నిరసన చేసినారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube