ఎట్టకేలకు అనేక ఎత్తులు.పై ఎత్తులు తరువాత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.
హైదరాబాద్లోని రాజ్భవన్లో ఇవాళ మధ్యాహ్నం 1:25 గంటలకు కేసీఆర్తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.కేసీఆర్ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, నేతలు… వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా… కేసీఆర్ గెలుపు ధీమాతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు .ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి ఎట్టకేలకు గెలుపును తన ఖాతాలో వేసుకోగలిగాడు.