తెలుగు చలన చిత్ర రంగంలో రెండు దశాబ్దాల పాటు హాస్యనటుడిగా పేరు గాంచిన నటులలో రాజా బాబు ఒకరు.సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన ఈయన రాజబాబుగా మనకి పరిచయం అయినాగానీ ఆయన అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.
అక్టోబర్ 20, 1935 సంవత్సరంలో జన్మించాడు.ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జన్మించారు.
ఇంటర్ వరకు చదివి ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే నాటకాలలో నటించారట “కుక్కపిల్ల దొరికిందా”, “నాలుగిళ్ళ చావిడి“, “అల్లూరి సీతారామరాజు” మొదలగు నాటకాలు వేశాడు.అలా 1960 లో సమాజం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఆ తర్వాత 1962 లో వచ్చిన భీష్మా సినిమాలో నటించిన రాజబాబుకి మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది.అప్పటి నుంచి ఆయనకు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.
అలాగే పరమానందయ్య శిష్యులు సినిమాలో ఆయన చేసిన నటనకు మంచి మార్కులే వచ్చాయి.ఈ తరం వాళ్లు ఆ సినిమాను ఇప్పుడు చూసినాగాని పగలబడి మరీ నవ్వుతారు.
రాజబాబు హాస్యనటుడిగా మాత్రమే కాకుండా హీరోగా కూడా ఒక సినిమాలో నటించాడు.“మనిషి రోడ్డున పడ్డాడు” అనే సినిమాలో కూడా రాజబాబు హీరోగా నటించి అందరినీ మెప్పించాడు.ఇలా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.అలాగే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడుగా రాజబాబు పేరు గాంచారు.ఆయన 1981వ సంవత్సరం దాక కూడా సినిమాల్లో నటిస్తూనే వచ్చారు.
ఆ తర్వాత రాజబాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో 1980వ సంవత్సరం ఫిబ్రవరి 7 వ తారీఖున చనిపోయాడు.ఆయన మరణించినా కానీ ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఆయన్ని అభిమానిస్తారు.
అలాగే రాజబాబు రూపం ప్రతి అభిమాని గుండెల్లో ఒక చెరగని ముద్ర లాగా అలాగే ఉండిపోయింది.
రాజా బాబు పేరు ఉంటే చాలు ఎంతో మంది ప్రేక్షకులు ఇప్పటికీ నవ్వుకుంటూ ఉంటారు.మన దేశం మెచ్చిన హాస్య నటుల్లో ఒకరిగా రాజబాబుని చెప్పుకోవచ్చు.ఇంకా రాజబాబు వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు , శ్రీమతి రవణమ్మ.
రాజబాబు డిసెంబరు 5, 1965 వ తేదీన లక్ష్మీ అమ్ములును వివాహమాడాడు.వీళ్ళకి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.రాజబాబు మరణించిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అమెరికాకు వెళ్లిపోయారు.అక్కడే చదువుకున్నారు.
అలాగే ఉన్నత చదువులు చదువుకుని అక్కడే నివాసం ఉంటూ సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా పెట్టుకున్నారు.ఇండియాలో కూడా కోట్ల విలువ చేసే ఆస్తులను కూడ పెట్టుకున్నారు.
ప్రస్తుతం మనం ప్రతిరోజు వాడుతున్న జిపిఆరేస్ సిస్టమ్ వారు తయారుచేసిందే.అమెరికాలో వారి కంపనీ తరుపున రోజుకి ఐదు గంటలు అక్కడ పోలీసులు తరుపున కూడా పనిచేస్తారు.
తండ్రి అయిన రాజబాబు సినీ నటుడిగా చిత్రసీమకి, దేశానికీ ఎంతో సేవ చేసాడు.కానీ కొడుకులు ఉన్నత చదువులు చదువుకుని పక్క దేశంలో ఉంటూ ఆ దేశ అభివృద్ధికి పాటుపడుతూ, అక్కడే సంస్థలను స్థాపించి జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే రాజబాబుకి ఉన్నత చదువులు చదివి అమెరికాలో సెటిల్ అయిన కొడుకుల ఉన్నారన్నా విషయం చాలా మందికి తెలియదు.అమెరికాలోని కోట్లాధిపతులలో రాజబాబు కొడుకులు కూడా ఉండడం విశేషం అని చెప్పాలి.!!
.