Manobala : పాపం.. చివరి రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో కమెడియన్.. నెట్టింట వీడియో వైరల్?

ప్రముఖ దివంగత కమెడియన్ నటుడు మనోబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మనోబాల ఇటీవలే మే 3వ తేదీన అనారోగ్యం కారణంగా కన్ను మూసిన విషయం తెలిసిందే.

 Comedian Manobala Last Video Will Make You Teary Eyed-TeluguStop.com

తమిళ నటుడు అయిన మనోబాల( Manobala ) తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు.కాగా తెలుగులో పున్నమి నాగు, మహానటి, దేవదాసు, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన చివరి రోజుల్లో ఎలా ఉన్నారు అన్న విషయాన్ని తెలుపుతూ తాజాగా ఒక వీడియోని విడుదల చేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఆ వీడియోలో చివరి రోజుల్లో మనోబాలకు కనీసం కదలడానికి కాళ్లు, చేతులు సహకరించడం లేదు.నోరు పెగల్చడానికి కూడా ఎంతో ఇబ్బందిపడ్డారు.

ఆయనతో మాట్లాడించేందుకు అందరూ కలిసి ఎంత ప్రయత్నించినా మనోబాల మాట పెదవి దాటి బయటకు రాలేకపోయింది.మనోబాల తన కొడుకు హరీశ్‌( Harish ) పాడిన పాట చివరిసారిగా విని సంతోషించారు.

మనోబాల కదల్లేని స్థితిలో వీల్‌ చైర్‌కే పరిమితం కావడంతో ఆయన అసిస్టెంట్‌ అతడికి తినిపిస్తూ నీళ్లు తాగించాడు.

అలా ఒకవైపు కొడుకు పాట పాడుతుంటే మరోపక్క ఆయనకు భోజనం తినిపించారు. అయితే సినిమాల్లో ఎంతో యాక్టివ్‌గా కనిపించే మనోబాలను ఇలా వీల్‌చైర్‌కే పరిమితం అవ్వడాన్ని చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

సినిమాలో ఆయన నటన కామెడీ చూసి కడుపుబ్బా నవ్వుకున్న ప్రేక్షకులు ఇలా ఆకరి వీడియో చూసి బాధను వ్యక్తం చేయడంతో పాటు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube