విజయవాడ: అడ్మినిస్ట్రేటివ్, ప్రిన్సిపల్ సూపర్డెంట్ రెండు రోజుల ట్రయినింగ్ పోగ్రామ్ ప్రారంభించిన మంత్రి.మినిష్టర్ విడదల రజిని పాయింట్స్.
మెడికల్ కాలేజ్,ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేసే సూపర్ డెంట్స్ రెండు రోజులు పాటు ట్రయినింగ్ పోగ్రామ్ పెట్టడం ఆనందగా ఉంది.హెల్త్ మీద ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీ ద్వారానే అమలు అవుతుంది.
హాస్పిటల్ కి వచ్చే ప్రజలకి అనేక సౌకర్యం మీరే కారణం.హెల్త్ డిపార్ట్మెంట్ లో సిఎం జగన్ అనేక మార్పులు చేసారు…మీ సలహాలు, సూచనలు వలన నాకు చాలా అవగాహనా వచ్చింది.
ప్రజల ఆరోగ్యం పట్ల సిఎం జగన్ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నారు.కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు ఉన్న ముందు ఉంది పని చేసింది మీరే… మీ సేవ వేలకట్ట లేనిది.
అడ్మిస్టేట్ పరంగా పాలన పరంగా అన్ని అమలు చేయాలి అంటే మీ సేవలు కావాలి.ప్రభుత్వ హాస్పిటల్, జగన్ మీద నమ్మకం డాక్టర్స్ మీద ప్రజలకి నమ్మకం వచ్చింది…
వైద్య రంగంలో అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ట్రీట్మెంట్ తీసుకున్నాక ప్రజలు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి.అలాంటి వైద్యం మీరు చేయాలి…హాస్పిటల్ లో ఏదయినా సమస్యలు ఉంటే వెంటనే అధికారులకి తెలియజేయాలి….
పద్ధతి ప్రకారంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ నాడు నేడు ద్వారా మార్పుకి శ్రీకారం చుట్టాము.హాస్పటల్స్ చిన్న చిన్న సమస్యలు ఉంటే మీకున్న అధికారంతో మీరే సరిదిద్దుకోవాలి…సిఎం జగన్ పాలనలో ఆరోగ్యశ్రీలో 1050 కొత్త వాటితో 3వెలకి పైన రోగాలకి చికిత్స చేస్తున్నం.
ఆరోగ్య ఆసరా మన ప్రభుత్వం ఇస్తుంది…జగనన్న ప్రభుత్వం జీరో రికూర్మెంట్ తో ముందుకు పోతుంది.ఇప్పటి వరకు వైద్య రంగంలో 40 వేలకి పైగా స్టాఫ్ ని తీసుకున్నాము.
బడ్జెట్ లో ఆరోగ్యనికి పెద్ద పీట వేస్తున్నాము.ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ పెడితే అమలు అవుతుందా అని చాలా మంది ఆశ్చర్యం పోయారు.ఫ్యామిలీ డాక్టర్స్ వలన 104 ద్వారా గ్రామాల్లో ప్రజలకి అందుబాటులో డాక్టర్స్ ఉంటున్నారు.నెలకి రెండు సార్లు డాక్టర్స్ ప్రతి ఇంటికి వెళ్లి వైద్యం, సూచనలు చేసి మెడిసిన్ ఇవ్వడం అనేది గొప్ప విషయం…ఫ్యామిలీ డాక్టర్స్ వలన ప్రభుత్వ హాస్పిటల్స్ లో బాధ్యత తగ్గుతుంది ప్రజలకి మంచి వైద్యం ఇంటి దగ్గరే ఇవ్వడం మంచి పరిణామం.
రాష్టం విడిపోయాక అనేక సమస్యలు ఉన్నాయి అయినా 17 మెడికల్ కాలేజ్స్ సిఎం జగన్ తీసుకువస్తున్నారు…ఇప్పటికే 4 మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభం కూడా అయ్యాయి.రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీస్ అందుబాటులోకి వస్తున్నాయి…ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉండాలనేది సిఎం జగన్ లక్ష్యం.