తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో పాలనపరంగా ప్రక్షాళన తరహాలో గత ప్రభుత్వానికి సంబంధించిన నియామకాలను కూడా రద్దు చేస్తున్నారు.
అదేవిదంగా గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది.? ఏ మేరకు ఖర్చు అయ్యింది అనే వివరాలు సేకరిస్తున్నారు.త్వరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేత పత్రం కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలియజేశారు.
వ్యవసాయ పెట్టుబడుల నిధుల విడుదలపై.కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ పై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.రైతు భరోసా కింద పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని సీఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా ట్రెజరీ లో ఉన్న నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు.గతంలో మాదిరిగా రైతులకు( Formers ) చెల్లింపులు చేయాలని సూచించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో సీఎం రేవంత్ ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో రైతులకు పంట పెట్టుబడి సాయం వారి ఖాతాలో జమ కానుంది.