కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల సమస్యలను సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈ క్రమంలో వారి కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.కానీ పాలకులు ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు.
ఎనిమిది గంటల కంటే ఎక్కువగా కార్మికులు పని చేస్తున్నారన్న ఆయన కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతుందని తెలిపారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి కార్మికుడు బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ద్వారానే అసంఘటిత కార్మికులకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు.