పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా పలు క్రేజీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఎప్పుడు లేని విధంగా ఈసారి వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ పవర్ స్టార్ తన ఫ్యాన్స్ కు ట్రీట్ పెంచుకుంటూ పోతున్నాడు.
తాజాగా ఈయన లైనప్ లో మరో స్టార్ డైరెక్టర్ పేరు వినిపించింది.తాజాగా వచ్చిన గాసిప్ ప్రకారం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో( Lokesh Kanagaraj ) పవన్ సినిమా చేయబోతున్నాడు అని టాక్.
ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని.ఆల్రెడీ పవన్ తో కూడా మాట్లాడేసారని.రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.మరి ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.
ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని టాక్.ఇప్పటికే పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాలలో ఎప్పుడు ఏది కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారో తెలియక సతమతం అవుతుంటే కొత్తగా మరో ప్రాజెక్ట్ ను ఎలా ఫిక్స్ చేస్తారు.
పవన్ ఫ్యాన్స్ సైతం ముందు ప్రకటించిన సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాతనే కొత్త సినిమాలను అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నారు.మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు ను ( Hari Hara Veera Mallu )ముందుగా పూర్తి చెయ్యమని అడుగు తున్నారు.ఇటీవలే పవర్ స్టార్ వినోదయం సీతం రీమేక్ ను పూర్తి చేసాడు.బ్రో అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 28న రిలీజ్ కాబోతుంది.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసారు.అలాగే సుజీత్ దర్శకత్వంలో ప్రకటించిన ఓజీ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ముందుగా ఈ సినిమానే పూర్తి చేసే ఊపులో పవన్ ఉన్నారు.అయితే ఎప్పుడో రెండేళ్ల క్రితమే ప్రకటించిన వీరమల్లు మాత్రం కాల్ షీట్స్ ఇవ్వడం లేదు.