ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై మరి కాసేపటిలో క్లారిటీ రానుంది.ఈ క్రమంలో జగన్, విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.
విదేశాలకు వెళ్లేందుకు జగన్, విజయసాయిరెడ్డి కోర్టును అనుమతి కోరారు.సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఫ్యామిలీ వెకేషన్ కోసం లండన్ వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి కూడా న్యాయస్థానాన్ని కోరారు.
ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని విన్నవించారు.మరోవైపు అనుమతులు ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మరికాసేపటిలో తీర్పును వెలువరించనుంది.