తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వరుస కేసులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ కేసు కాకుండా అంగళ్లు కేసు, ఫైబర్ నేట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు వరుసగా ఉన్నాయి.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అంగళ్లు ఘర్షణ కేసులో బెయిల్ మంజూరు కావడం తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా ఫైబర్ నెట్ స్కామ్ కేసులో కూడా చంద్రబాబుకి ఊరట లభించింది.ఈ కేసుకు సంబంధించి ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ మెమో దాఖలు చేయడం జరిగింది.
బుధవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయడం లేదని కోర్టుకు తెలిపింది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడటం తెలిసిందే.కాగా పీటీ వారెంట్ విచారణ కోసం సోమవారం కోర్టులో హాజరు పరుస్తారని అదే రోజు అరెస్టు చేస్తారని లాయర్ లుధ్రా తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో ఇప్పుడే అరెస్టు చేయమని సీఐడీ లాయర్ సమాధానం ఇవ్వడం జరిగింది.
మరోపక్క జైల్లో చంద్రబాబు అనారోగ్యం పాలు కావడం టీడీపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది.చంద్రబాబుకి జైల్లో ఏదైనా జరిగితే వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని.హెచ్చరికలు చేస్తున్నారు.