సీఐ సార్ మీరు సూపర్ అండీ.. మీలాంటి వారుంటే చాలండీ.. !

తోటి వారికి సహయం చేయాలంటే ముందుగా ఉండవలసింది మంచి మనస్సు, సహయం చేయాలనే ఆరాటం.ఈ రెండు ఉంటే చాలు.

 Ci Helping The Poor Peoples    Bhadradri Kottagudem, Ashwapuram, Ci Raju, Helpin-TeluguStop.com

ఉన్నంతలో ఇతరులకు మంచి చేయవచ్చూ.ఇక పచ్చని పొలంలో కలుపు మొక్కలున్నట్లుగా లోకంలో మంచి చెడు అనే రెండు మనస్తత్వాలుంటాయి.

కానీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మంచివారు చాలా అరుదుగా కనిపిస్తారు.ఈ మధ్య కాలంలో కొందరు పోలీసు అధికారులు తమకు తోచిన మంచిని నలుగురికి పంచిపెట్టడం తరచుగా సోషల్ మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే.

ఈ కోవకే చెందిన వ్యక్తి సీఐ సట్ల రాజు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మనుబోతులగూడెం రవాణా సౌకర్యం కూడా లేని పూర్తి అటవీ గ్రామం.నిరుపేదలు నివసించే గూడెం.ఈ గ్రామంలోని గిరిజనుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ సట్ల రాజు తన సొంత డబ్బులతో ఇక్కడి స్దానికులకు విడతల వారీగా 30 సెల్‌ఫోన్లు కొని సిమ్‌లు వేయించి అందించడం విశేషం.

అయితే సీఐ చేతుల మీదుగా ఫోన్‌ అందుకున్న గ్రామస్దులు మొదట పూజలు చేసి వాడటం మరీ విశేషం.

నిజానికి పోలీసుల్లో కఠినత్వాన్ని మాత్రమే చూస్తున్న వారు అప్పుడప్పుడు ఇలాంటి వారుని చూసి సీఐ సార్ మీరు సూపర్ అండీ మీలాంటి వారు గ్రామానికి ఒక్కరుంటే చాలండీ అని అనుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube