సింగపూర్‌ : భారతీయ మహిళపై బూతుల వర్షం , ఆపై దాడి .. చైనా జాతీయుడిని దోషిగా తేల్చిన కోర్ట్

భారతీయ మహిళను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా దాడికి పాల్పడిన కేసులో చైనా జాతీయుడిని సింగపూర్ కోర్ట్( Singapore Court ) దోషిగా తేల్చింది.2021 మేలో సింగపూర్‌లో కరోనా మహమ్మారి ఉదృతంగా వున్న సమయంలో మాస్క్‌ను సరిగా ధరించలేదంటూ భారతీయ మహిళను నిందితుడు అడ్డుకున్నాడు.అక్కడితో ఆగకుండా ఆమెను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు ఛాతీపై తన్నాడు.నిందితుడిని వాంగ్ జింగ్ ఫాంగ్ (32)గా( Wong Xing Fong ) గుర్తించారు.ఇతను హిందోచా నీతా విష్ణుభాయ్ (57)పై( Hindocha Nita Vishnubhai ) చోవా చు కాంగ్‌లోని నార్త్‌వేల్ కండోమినియం( Northvale condominium ) సమీపంలో దాడికి పాల్పడ్డాడు.

 Chinese-origin Man Convicted Of Assaulting And Abusing Indian Woman In Singapore-TeluguStop.com
Telugu Indian, Brisk, Chinese Origin, Choa Chu Kang, Corona, Hindochanita, Singa

ఈ కేసుకు సంబంధించి వాంగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అతనిని దోషిగా తేల్చింది న్యాయస్థానం.జూలై 31న అతనికి శిక్షను ఖరారు చేయనుందని ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.

ఘటన జరిగిన రోజున విష్ణుభాయ్ చోవా చు కాంగ్‌ స్టేడియంలో తాను పనిచేసే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లేందుకు గాను వేగంగా (brisk walking) నడుస్తోంది.ఈ క్రమంలో ఆమెను ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించడంతో బాధితురాలు వెనక్కి తిరిగింది.

అక్కడ నిందితుడు వాంగ్, అతనికి కాబోయే భార్య చువా యున్ హాన్‌ వున్నారు.వీరిద్దరూ ఆమెను మాస్క్ ( Corona Mask ) సరిగా ధరించాలని గద్దించారు.

అయితే నోరు, ముక్కును మాస్క్‌ నుంచి తప్పించి ధరించే brisk walkingకి సింగపూర్ ప్రభుత్వం అప్పట్లో మినహాయింపునిచ్చింది.ఇదే విషయాన్ని విష్ణుభాయ్ కోర్టుకు తెలిపింది.

Telugu Indian, Brisk, Chinese Origin, Choa Chu Kang, Corona, Hindochanita, Singa

అయినప్పటికీ తనను నిందితుడు అసభ్య పదజాలంతో దూషించాడని వెల్లడంచింది.గొడవ పెద్దదవుతున్నట్లు గ్రహించి తాను ‘God bless you’ అని దీవించి వెళ్లబోయానని , కానీ నిందితుడు తనను ఛాతీపై తన్నాడని ఆమె పేర్కొంది.ఆ దెబ్బకు కిందపడిపోయిన తనకు ఒక వ్యక్తి సాయం చేశాడని, తన గాయానికి ప్లాస్టర్ వేశాడని విష్ణుభాయ్ తెలిపింది.ఈ ఘటనపై అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కోర్ట్‌కు తెలిపింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube