ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరే లేదు.. చదువు కోసం ఆధార్ కార్డు ఇప్పించండి.. చేతులు జోడించి వేడుకుంటున్న పిల్లలు..

తమకు ఆధార్ కార్డు ఇంపిచాలని ఆదివాసీ గిరిజన బాలబాలికలు ఆదివారం విన్నూతంగా చేతులు జోడించి వేడుకున్నారు.విశాఖపట్నం జిల్లాలో జి.

 Children Request To Issue Aadhar Cards For Studies Whose Tribal Village In Not I-TeluguStop.com

మాడుగుల, రావికమతం మండలం సరిహద్దులో ‘నేరేడు బంద‘ అనే గ్రామం ఉంది.ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి.

మారుమూల ఉండే ఆదివాసీ గ్రామం కావడంతో ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ఇక్కడ జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ కాలేదు.వీరు ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దనే జన్మించడంతో.

ఆరోగ్య సిబ్బంది రికార్డులో కూడా వీరి గురించి నమోదు కాకపోవడంతో వీరికి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.దీంతో ఆధార్ కార్డులు జారీ చేయడం సమస్యగా మారింది.

మండలంలోని పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే ‘నేరేడు బంద’ గ్రామం రికార్డు (జాబితాలో) లో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.తల్లిదండ్రులకు కూడా ఆధార్ కార్డులు లేవు.

మాకు ఎలాగో చదువులు లేవు మా బిడ్డలకైనా  మంచి భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు.దీంతో పాటు ప్రభుత్వ పథకాలు దూరమవుతున్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతులు జోడించి విన్నవించుకుంటున్నాము జిల్లా కలెక్టర్, ఐటీడీఏపీవో చర్యలు చేపట్టి మాకు ఆధార్ కార్డు ఇప్పించాలని గిరిజన పిల్లలు వేడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube