90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సీరీస్.( 90’s A Middle Class Biopic ) ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సిరీస్ గురించి కొనసాగుతుంది ఈటీవీ విన్ లో వచ్చిన ఈ సిరీస్ లో శివాజీ,( Sivaji ) వాసుకి( Vasuki ) ముఖ్యపాత్రలో నటించగా వీరి జోడి అదిరిపోయింది.
వీరితో పాటు వీరికి ముగ్గురు పిల్లలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టులు సైతం మంచి పేరు అందుకున్నారు.ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సిరీస్ ని చూడాలంటూ ప్రారంభంలోనే ఒక వాయిస్ తో దర్శకుడు చెప్పగా నిజంగానే చాలామంది 90’s కిడ్స్ ఈ సిరీస్ కి కనెక్ట్ అవుతున్నారు.
దర్శకుడు ఖచ్చితంగా ఏదైతే చెప్పాలనుకున్నాడో చాలా క్లారిటీగా చెప్పాడు పైగా ఈ సిరీస్ కి మంచి పేరు లభిస్తుంది.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీకి మంచి బ్రేక్ త్రూ అని చెప్పుకోవచ్చు అని ఈ సిరీస్.అలాగే చాలా రోజులుగా ఒక సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్న వాసుకి సైతం మంచి అవకాశం గా ఇది రావడం ఆమె కెరీర్ కి బాగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక కుటుంబానికి సంబంధించిన కథ కాబట్టి తల్లిదండ్రులుగా శివాజీ వాసుకి అద్భుతంగా నటించారు.
వారితో పాటు వారి పిల్లలుగా నటించిన ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్నారు.వీరిలో పెద్ద కుమారుడిగా నటించిన మౌళి తనుజ్ ప్రశాంత్( Mouli Tanuj Prasanth ) ఇప్పటికే instagram లో సెలబ్రిటీ గా పేరు సంపాదించుకున్నాడు.అతడికి 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం.మౌళి టాక్స్ అనే పేరుతో అతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.హాస్టల్ డేస్ అనే ఒక సిరీస్ లో కూడా ఇదివరకే నటించాడు.
ఆ తర్వాత కూతురు దివ్య పాత్రలో నటించింది వాసంతిక.( Vasanthika ) ఈ అమ్మాయి సలార్ చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఇప్పుడు ఈ సిరీస్ కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
భవిష్యత్తులో మంచి నటి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వీరిద్దరిని మించి చిన్నపిల్లాడిగా నటించిన ఆదిత్య పాత్ర బాగా పేరు సంపాదించడం ఇతడికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని కచ్చితంగా చెప్పొచ్చు.
ఆదిత్య అసలు పేరు రోహన్( Rohan ) సీరియల్స్ లో ఇంతకు ముందు నటించాడు.ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ అవుతున్నాడు.