ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును నేతలు హాస్తం గూటికి చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రమంలోనే తుమ్మల నివాసానికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు.ఒకరి తరువాత ఒకరు తుమ్మలను కలుస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లో తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీకాగా ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి కాంగ్రెస్ లోకి రావాలంటూ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తుమ్మల నివాసానికి వెళ్లనున్నారు.
ఈ క్రమంలోనే తుమ్మలను మర్యాదపూర్వకంగా కలవనున్న భట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.